* నా హక్కులను రేవంత్ సర్కార్ కాలరాస్తుంది
* విచారణ పేరుతో నా ఇంటిపై దాడికి కుట్రలు
* బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాం తి): ప్రభుత్వ వైఫల్యాలు ఎండగుతున్న తమను అపేందుకు, రైతుభరోసాపై చేసిన దగా కోరు మోసాన్ని కప్పిపుచ్చడానికే ఏసీబీతో తనను వేధించేందుకు సీఎం రేవం త్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు. హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన కేసులో విచారణకు పిలవడం అంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శించారు.
ఫార్ములా ఈ కార్ రేసు అంశంలో ఈ నెల ౨న అవినీతి నిరోధక శాఖ ఇచ్చిన నోటీసులకు స్పందిస్తూ రాజ్యాంగం తనకిచ్చిన హక్కు మేరకు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా రాతపూర్వకంగా జవాబు ఇవ్వాలనుకున్నాన ని చెప్పారు. సోమవారం తన న్యాయవాదులతో కలసి బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు.
అయితే ఏసీబీ కార్యాలయం మెయిన్ గేట్ ముందే కేటీఆర్ వాహనాన్ని ఆపిన పోలీసులు.. న్యాయవాదులతో కలిసి లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పారు. గేట్ ముందే చాలాసేపు ఆపడంతో తాను ఇవ్వాలనుకున్న రాతపూర్వక స్పందనను ఏసీబీ అధికారులకు రోడ్డు మీదనే కేటీఆర్ అందించారు.
డిసెంబర్ 18 న తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టులో సవాలు చేసి న అంశాన్ని అందు లో ప్రస్తావించడంతోపాటు డిసెంబర్ 31న తుది వాదన లు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వు చేసిందని గుర్తుచేశారు.ఇదే కేసులో ప్రతివాదిగా ఉన్న ఏసీబీ, ఈ అంశంలో సుదీర్ఘమైన వాదనలను వినిపించిందని గుర్తుచేశారు.
హైకోర్టు తీర్పు తరువాత చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. దీంతోపాటు తనకు ఇచ్చిన నోటీసుల్లో సమాచారంతోపాటు డాక్యుమెంట్లను అందివ్వాలన్న విషయాన్ని ప్రస్తావిం చిన కేటీఆర్, ఏ అంశాల పైన సమాచారం, డాక్యుమెంట్లు కావాలన్న విషయం నోటీసుల్లో స్పష్టంగా లేదని ఏసీబీకి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
రాష్ట్రంలో రేవంత్ సొంత రాజ్యాంగం
రాష్ర్టంలో తన సొంత రాజ్యాంగాన్ని అమలుచేయాలన్న దురాలోచనలో రేవంత్‌రెడ్డి ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. రాజ్యాంగపరమైన హక్కులను కాలరాసేలా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుందన్నారు. గతంలో తమ పార్టీ నాయకుడు నరేందర్ రెడ్డిని విచారణ పేరుతో పిలిచి ఆయన ఇవ్వకున్నా అసత్యాలతో కూడిన ఒక స్టేట్‌మెంట్‌ను మీడియాకు విడుదల చేశారన్నారు.
ఇప్పుడు కూడా అదేవిధంగా చేసే అవకాశం ఉన్నందునే న్యాయవాదులతో కలిసి విచారణకు వెళ్లాలనుకున్న ట్టు చెప్పారు. తనవెంట న్యాయవాదులు ఉంటే ఈ ప్రభుత్వానికి సమస్య ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక పౌరుడిగా న్యాయవాదుల సహకారం తీసుకునే హక్కు తనకు లేదనే విషయాన్ని రాతపూర్వకంగా రాసి ఇవ్వాలని ఏసీబీ అధికారులను డిమాండ్ చేశారు.