హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు(ACB Court) గురువారం అనుమతిచ్చింది. ఈ నెల 13 నుంచి 23 వరకు బ్రిస్బేన్, దావోస్ పర్యటనకు ఏసీబీ కోర్టు ఒకే చెప్పింది. ఓటుకు నోటు కేసు(Note For Vote Case) బెయిల్ సందర్భంగా పాస్ పోర్టును రేవంత్ కోర్టుకు అప్పగించారు. ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉందని సీఎం తెలిపారు. 6 నెలలు పాస్ పోర్టు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి అభ్యర్థనను ఏసీబీ కోర్టు అంగీకారం తెలిపింది. జులై 6లోపు పాస్ పోర్టు తిరిగి అప్పగించాలని రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు ఆదేశించింది.