calender_icon.png 22 April, 2025 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణికొండ మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు

11-12-2024 12:40:38 AM

రాజేంద్రనగర్, డిసెంబర్ 10: మణికొండ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికా రులు తనిఖీలు చేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన డీఈఈ దివ్యజ్యోతి ఇంట్లో ఇటీవల జరిపిన ఏసీబీ దాడుల్లో పెద్ద ఎత్తున డబ్బుల కట్టలు వెలుగుచూసిన విషయం తెలిసిందే.

ఈనేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆమె గతంలో పనిచేసిన మణికొండ మున్సిపల్ కార్యాలయంలో తనిఖీలు చేసినట్లు సమాచారం. దివ్యజోత్యి ఇక్కడ డీఈఈగా పనిచేసిన సమయంలో.. ఆమె అప్రూవ్ చేసిన ఫైల్స్, సంబంధిత డాటాను ఏసీబీ అధికారులు తీసుకెళ్లారు.

డీఈఈ దివ్యజ్యోతి ఇక్కడ పనిచేసిన సమయంలో మున్సిపల్ నిదులను పెద్దఎత్తున నిధులు దారి మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ఏసీబీ దాడుల నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని మిగితా మున్సిపాలిటీల ఉన్నతాధికారులు సెలఫోన్లను స్విచ్ఛాఫ్ చేయడంతో పాటు ఆఫీసుల నుంచి వెళ్లిపోయారు.