calender_icon.png 13 November, 2024 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి పట్టుబడ్డ వర్ని ఎస్సై

09-11-2024 12:59:51 AM

ఏసీబీకి పట్టుబడ్డ కృష్ణకుమార్

స్టేషన్ బెయిల్ కోసం లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

కామారెడ్డి(నిజామాబాద్), నవంబర్ 8 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా వర్ని ఎస్సై కుష్ణకుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఏసీబీ డీఏస్పీ శేఖర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని ఎస్సైగా పనిచేస్తున్న కృష్ణకుమార్ వర్ని మండలం కోటయ్య క్యాంప్‌నకు చెందిన రైతు నాగరాజుకు ఓ కేసు విషయంలో స్టేషన్ బెయిల్ కోసం లంచం డిమాండ్ చేశాడు.

బెయిల్ ఇవ్వడానికి ఎస్సై రూ.50 వేలు డిమాండ్ చేశాడు. రూ.20 వేలకు ఒప్పందం కుదురగా.. నాగరాజు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు శుక్రవారం నాగరాజు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎస్సైని పట్టుకున్నారు.