11-03-2025 11:01:04 PM
రూ. 50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇంజనీర్....
ఆదిలాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో ఏసీబీ అధికారులు విసిరిన వలకు ఓ అవినీతి అధికారి చిక్కారు. రూ. 50 వేల లంచం తీసుకుంటూ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిన్నంవార్ శంకర్ ను మంగళవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి రెండు కోట్లు మంజూరు అయ్యాయి. ఐతే మంజూరైన నిధుల్లో ఒక్క శాతం తనకు ఇవ్వాలని ఇంజనీర్ జిన్నంవార్ శంకర్ సదరు కాంట్రాక్టర్ నుండి లంచం డిమాండ్ చేశారు.
ఒక్క శాతం అంటే రెండు లక్షల డిమాండ్ చేయగా, లక్ష రూపాయలకు డీల్ కుదిరింది. ఈ క్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిన్నంవార్ శంకర్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు.