calender_icon.png 7 March, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన చౌటుప్పల్ ట్రాన్స్‌కో ఏడీ

07-03-2025 12:53:00 AM

  • రూ.70 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ శ్యామ్ ప్రసాద్
  • హైదరాబాద్ కొత్తపేట నివాసం వద్ద కొనసాగుతున్న ఏసీబీ అధికారుల సోదాలు

యాదాద్రి భువనగిరి, మార్చి 6 (విజయక్రాంతి): సోలార్  విద్యుత్తు ప్లాంటు కు మీటరు అమర్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఓ అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు వలవేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకు న్నారు.  యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ట్రాన్స్ కో కార్యాలయంలో ఆపరేషన్ ఏడీగా పనిచేస్తున్న గాజుల శ్యాం ప్రసాద్ తంగడపల్లి లోని ఓ పరిశ్రమ యాజమా న్యం నుంచి రూ. 70 వేలు లంచం తీసుకుంటుండగా గురువారం ఏసీబీ అధికారులు వల వేసి పట్టుకున్నారు.

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తంగడపల్లి రెవెన్యూ పరిధిలోని అక్రిట్ పరిశ్రమ యాజమాన్యం తమ పరిశ్రమలో సోలార్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు ఓ సంస్థకు  కాంట్రాక్ట్ అప్పగించారు. ఈ సోలార్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేసిన సదరు కాంట్రాక్ట్ సంస్థ సోలార్ నుండి ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును పరిశ్రమలోని విద్యుత్ లైనుకు అనుసంధానం చేయడానికి కొత్త విద్యుత్తు మీటరు ఏర్పాటు చేయాల్సి ఉంది.

ఈ పనులు పూర్తి చేస్తేనే  సదరు కాంట్రాక్టర్ కు అక్రిట్ పరిశ్రమ యాజమాన్యం బిల్లులు విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో కాంట్రాక్టర్ విద్యుత్ ఏడీ శ్యాం ప్రసాద్ కు విషయం తెలుపగా  ఆయన తన పరిధిలో లేకున్నా డీఈ తో మాట్లాడి  పనులు చేయిస్తానని సదరు కాంట్రాక్టర్ వద్ద రూ. 70 వేలు లంచం డిమాండ్ చేశారు.

ఇదే విషయమై గురువారం చౌటుప్పల్‌లో ఓ రహ స్య ప్రదేశంలో  కాంట్రాక్టర్ నుంచి రూ. 70 వేలను తీసుకుంటుండగా ముందస్తు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు మె రుపు దాడి చేసి ఏడీ శ్యాంప్రసాద్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏడీ శ్యాం ప్రసా ద్ నుండి లంచం డబ్బులు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు అతన్ని హైదరా బాద్ నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్టు తెలిపారు.

ఇదిలా ఉండగా హైదరా బాద్ కొత్తపేటలో ఉన్న విద్యుత్ ఏడీ శ్యాం ప్రసాద్  నివాసం వద్ద  ఏసీబీ ఇన్స్పెక్టర్ ర ఘునందన్, వెంకటేష్‌ల ఆధ్వర్యంలో సోదా లు కొనసాగుతున్నట్టు సమాచారం. ఈ దా డుల్లో ఏసీబీ డీఎస్పీ జగదీష్‌చందర్, ఇన్స్పెక్టర్లు రామారావు, వెంకట్రావు పాల్గొన్నారు.