calender_icon.png 24 January, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లి జిల్లాలో ఏసీబీ వలలో అవినీతి తిమింగలం

24-01-2025 12:30:16 AM

పెద్దపల్లి జనవరి 23విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో గురువారం ఎసిబి వలలో  అవినీతి తిమింగలం చిక్కింది.  రిటైర్డ్ ఉపాద్యాయుడు కన్నూరి ఆనందరావు నుండి రూ. 10వేలు లంచం తీసుకుంటూ రామగుండం ఎస్ టిఓ  ఏకుల మహేశ్వర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

ఆఫీస్ సబార్డినేట్ రెడ్డవేణీ పవన్ పెన్షన్ మంజూరు కోసం రిటైర్డ్ ఉపాధ్యాయడైన కన్నూరి ఆనంద రావు కు పెన్షన్ ఎస్ టి ఓ కార్యాలయం చుట్టూ తిరుగుతుండగా పెన్షన్ మంజూరి కోసం ఎస్టీవో లంచం డిమాండ్ చేయడంతో  బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు వలపన్ని  ఎస్ టి ఓ క్రికెట్ ఉపాధ్యాయుని వద్ద పదివేల లంచం తీసుకుంటుండగా మాటు వేసి పట్టుకున్నారు. జిల్లాలో ఏసిపి అధికారుల దాడితో సంచలన సృష్టించింది.