50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మండల సర్వేయర్...
అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలోని దమ్మపేట మండలంలో శనివారం మండల సర్వేయర్ వెంకటరత్నం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపిన వివరాల ప్రకారం... దమ్మపేటకు చెందిన ఓ రైతుకు తన 19.20 ఎకరాలు భూమి సర్వే కోసం దరఖాస్తు చేయగా, సర్వే చేసినందుకు రూ1.50 డిమాండ్ చేయటం జరిగింది. శనివారం ఆ రైతు సర్వేయర్ కు 50 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు.