calender_icon.png 26 October, 2024 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఏసీబీకి పట్టుబడిన అధికారులు

23-07-2024 01:46:17 AM

  • రూ. 20 వేలు తీసుకుంటూ చిక్కిన మున్సిపల్ కమిషనర్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 22 (విజయక్రాంతి): దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ ఎస్ రాజమల్లయ్య లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. కీసర రెవెన్యూ పరిధిలోని బండ్లగూడలో రిటైర్డ్ ఏఎస్పీ సత్యనారాయణకు సుదర్శన్ అనే వ్యక్తి మధ్య కొంత కాలంగా ఓ స్థలం విషయంలో వివాదం నడుస్తోంది. సుదర్శన్‌కు చెందిన స్థలంలో సత్యనారాయణ ప్రహరీ నిర్మించి ఆక్రమించుకున్నాడు. ఆ గోడను కూల్చివేయాలని కమిషనర్ రాజమల్లయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్‌ప్రసాద్‌లను సుదర్శన్ ఆశ్రయించాడు. అందుకు కమిషనర్ రూ.50వేల లంచం అడిగారు. 15రోజుల క్రితం రూ.20వేలు ఇచ్చిన సుదర్శన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో మిగిలిన రూ.30వేలు సుదర్శన్ నుంచి తీసుకుంటుండగా కమిషనర్ రాజమల్లయ్యను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 

5 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన ఇన్‌స్పెక్టర్.. 

సంగారెడ్డి కంది సీసీఎస్‌లో సస్పెన్షన్‌కు గురైన ఇన్‌స్పెక్టర్ ఎం యి వెంకటకిషోర్ సోమవారం రూ.5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కంది సీసీఎస్‌లో గతంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన సాయి వెంకటకిషోర్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి మెరుగు రవిపి రియల్ ఎస్టేట్ వ్యవహారానికి సంబంధించిన కేసు విషయంలో వెంకటకిషోర్ రూ.1.50 కోట్లు డిమాండ్ చేశాడు. అందులో రూ. 10 లక్షలు గతంలోనే తీసుకున్నాడు. తాజాగా మిగిలిన డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం రూ.5 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సాయి వెంకటకిషోర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.