- ఈ-కారు రేసు కేసులో నిందితుల విచారణ!
- 20 మంది అధికారులతో ప్రత్యేక బృందం
- మరోవైపు వివరాలు సేకరిస్తోన్న ఈడీ
హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి) : రాష్ర్టంలో సంచలనాత్మకంగా మారిన ఫార్ములా ఈ-కారు రేసు కేసు దర్యాప్తును అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) ముమ్మరం చేసింది. సంబంధిత ధ్రువపత్రాలను సేకరించే పనిలో పడింది. మరోవైపు ఫెమా, నిధుల మళ్లింపు కేసు నమోదుచేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం నుంచి విచారణ ప్రారంభించింది.
ఫార్ములా ఈ--రేస్ నిర్వహణ పేరుతో రూ.54 కోట్లు విదేశీ సంస్థ కు చెల్లించారని, దానికి సంబంధించి నిబంధనలు పాటించలేదని పురపాలక, పట్టణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఏసీబీ కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా, పది రోజుల వరకు అంటే ఈ నెల 30వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది.
మిగిలిన నిందితులైన అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బీఎల్ రెడ్డ్డిలను ఏసీబీ అరెస్ట్ చేయాలంటే ఎలాంటి అడ్డంకులు ఎదురుకావు. అంతకుముందు నిందితులను ఏసీబీ కార్యాలయానికి పిలిచి విచారించే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలోనే అంతర్గతంగా దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని తెలుస్తోంది.
కోర్టు ఉత్తర్వుల మేరకు డిసెంబర్ 30 వరకు కేటీఆర్ అరెస్టు లేకపోయినా.. ఏసీబీ తెరవెనక చేయాల్సిన తతంగమంతా చేస్తున్నట్లుగా సమాచారం. అంత లోపు ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించడమే కాకుం డా కేసుకు సంబంధించి విస్తృతంగా ఆధ్యయ నం చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం.
ఇప్పటికే కార్ రేస్‌కు సంబంధించిన వివరాలను సేకరించిన ఏసీ బీ, నిబంధనలకు విరుద్ధంగా నిధులు వినియోగించినట్లు ప్రాథమికంగా గుర్తించింది. స్పాన్స ర్‌గా ప్రకటించిన కొన్ని కంపెనీలు చివరి నిమిషంలో తప్పుకోవడంపై ప్రశ్నలు నెలకొన్నాయి.. ఈ కేసులో ఏసీబీ, ఈడీ సంయుక్తంగా పనిచే స్తూ, నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా ఈ కేసును త్వరితగతిన తే ల్చేందుకుగాను ఏసీబీ సుమారు 20 మంది అ ధికారులతో ఐపీఎస్ అధికారి రితిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయగా.. ఈటీఎంలో ఇద్దరు సీఐలతో పాటు పలువురు ఎస్సైలు, కానిస్టేబుల్స్ ఉన్నారని తెలుస్తోంది. ఫార్ములా- ఈ -రేస్ వ్యవహరంపై ఫిర్యాదు చేసిన ఐఎఎస్ దాన కిశోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ రికార్డ్ చేయనున్నది. అనంతరం నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టాలని ఏసీబీ యోచిస్తున్నది.
వివరాలు సేకరిస్తోన్న ఈడీ
2023 ఫిబ్రవరి 11న నిర్వహించిన రేస్‌తోపా టు 2024 ఫిబ్రవరి 10న నిర్వహించాలనుకు న్న మరో రేస్‌కు సంబంధించి ఫార్ములా ఈ ఆ పరేషన్స్ ఎఫ్‌ఈవోతో పురపాలక శాఖ నిర్వహించిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలను ఈడీ సేకరిస్తోంది. ఈ రేసు నిర్వహణకు ప్రతిపాదనను ఎవరు ఆమోదించారనే కోణంలో సమా చారాన్ని సేకరించనుంది.
ఈ మొత్తం పక్రియలో పాల్గొన్న ఉద్యోగుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అవసరమైతే వా రందరి వాంగ్మూలను ఈడీ నమోదు చేయనుం ది. ఈ వ్యవహారంలో నిబంధనలు ఎలా ఉన్నా యి. ఉల్లంఘనలు ఎక్కడ జరిగాయనే వివరాల ను జల్లెడ పట్టనుంది. నగదు లావాదేవీల వివరాలు సేకరిం చనున్న ఈడీ..
దానికి సంబంధిం చిన ఫైళ్లు పంపాలని ఆ రోజు పురపాలక పట్టణాభివృద్ధి సంస్థకు లేఖ రాసినట్లు సమాచారం. సర్టిఫైడ్ జిరాక్స్ కాపీలు తీసుకొని ఇందులో విదేశీ సంస్థకు చెల్లింపులు ఎలా జరిగాయని, న గదు లావాదేవీల వివరాలు తీసుకోనున్నారు. అనంతరం నిందితులకు నోటీసులు జారీ చేసి విచారి ంచడంతో పాటు వారి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసుకుంటుంది.
ఈ వ్యవహారంలో పాల్గొన్న కంపెనీల లావాదేవీల వివరా లను ఈడీ సేకరించింది. హిమాయత్‌నగర్‌లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ను సందర్శించనున్న ఏసీబీ, ఆర్బీఐ నుంచి ట్రాన్సాక్షన్ వివ రాలు కోరనుంది. బ్యాంకింగ్ లావాదేవీలు, ఆర్థి క వనరుల వినియోగంపై అధికారులు మరింత సమాచారం సేకరించనున్నట్లు తెలుస్తోంది.