హెచ్సీయూలో విద్యార్థి సంఘాల ఘర్షణ
హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్సీయూ)లో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాల నేతలు ఒకరి పై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రి కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులకు సర్దిచెప్పారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇదిలా ఉం టే వరుసగా విద్యార్థులపై ఏబీవీపీ దాడులు చేస్తూ క్యాంపస్లో విధ్వం సం సృష్టిస్తున్నారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఆర్ఎల్.మూర్తి, టి.నాగరాజు గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. విద్యార్థినులనూ చూడకుండా దాడులు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఈ దాడులను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.