బెల్లంపల్లి (విజయక్రాంతి): బాసర త్రిపుల్ ఐటీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని స్వాతి కుటుంబానికి న్యాయం చేయాలని అడిగిన విద్యార్థి సంఘాల నాయకులపై దాడి చేసిన కళాశాల సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బాసర త్రిపుల్ ఐటీని ముట్టడించేందుకు వెళ్తున్నారనే సమాచారంతో శనివారం ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దీపక్ కుమార్ ని బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మృతి చెందిన విద్యార్థిని స్వాతి కుటుంబానికి న్యాయం చేయాలని, ఏబీవీపీ నాయకులపై దాడికి పాల్పడిన త్రిపుల్ ఐటీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని దీపక్ కుమార్ కోరారు. ముందస్తు అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని పేర్కొన్నారు.