calender_icon.png 3 April, 2025 | 8:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌సీయూ భూములను రక్షించాలని ఏబీవీపీ ధర్నా

03-04-2025 12:16:25 AM

కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 2 (విజయ క్రాంతి): విశ్వవిద్యాలయాల భూములను రక్షించాలని అంటుంటే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారంటూ ఏబీవీపీ విద్యార్థి సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఐడిపిఎల్ చౌరస్తాలో బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ ములను విశ్వవిద్యాలయానికి ఉంచాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు.

ప్రభుత్వం అక్రమంగా హెచ్ సి యు భూములను అమ్ముకోవాలని చూస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. విద్యార్థి సంఘాల ధర్నాతో ఐడిపిఎల్ చౌరస్తాలో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ధర్నా చేస్తున్న విద్యార్థి నాయకులను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.అరెస్టు అయిన వారిలో మేడ్చల్ జిల్లా కన్వీనర్ నగేష్, భాగ్య నగర్ సంయుక్త కార్యదర్శి వివేక్, కొంపల్లి నగర సంయుక్త కార్యదర్శి శ్రీకాంత్, మహేష్, మనోజ్, దేవేందర్, నరసింహ తదితరులు ఉన్నారు.