12-03-2025 06:51:52 PM
బైంసా,(విజయక్రాంతి): వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని ఏబీవీపీ నిర్మల్ జిల్లా కన్వీనర్ మూడపెళ్లి దినేష్ డిమాండ్ చేశారు. బుధవారం బైంసాలో విలేకరులతో మాట్లాడుతూ మాట్లాడుతూ... విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని,అధిక నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధి కి కృషి చేస్తామని అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ విద్యారంగంపై సవితితల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. గత సంవత్సర బడ్జెట్ లో కేవలం 7% నిధులే కేటాయించిందని వాటిని కూడా పూర్తిగా విడుదల చేయలేదన్నారు. చిన్న రాష్ట్రాలైన ఈశాన్య రాష్ట్రాల్లో సైతం వాటి బడ్జెట్లో 12-13% నిధులు కేటాయిస్తుంటే మన రాష్ట్రంలో అరకొర నిధులు కేటాయించడం దురదృష్టకరమన్నారు. విద్యాసంస్థల్లో బోధన బోధ నేతల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.