సిద్దిపేట, డిసెంబర్ 25 (విజయక్రాంతి): జనమంచి గౌరీశంకర్ (గౌరీజీ) జీవితం నేటి విద్యార్థులకు స్ఫూరిగా నిలుస్తోందని నేషనల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్ న్యూఢిల్లీ చీఫ్ అడ్వైజర్ ప్రజ్ఞా పరాండె తెలిపారు. సిద్ధిపేటలో నిర్వహించిన ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభల కార్యక్రమంలో బుధవారం ఆమె పాల్గొని మాట్లాడారు. ఏబీవీపీలో పనిచేసిన వారికి మానవ సంబంధాలు బలంగా ఉంటాయన్నారు. మహాసభలను విజయవంతం చేసినవారికి కృతజ్ఞ్ఞతలు తెలిపారు.