calender_icon.png 28 October, 2024 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్మార్ట్‌గా దుర్వినియోగం

14-09-2024 12:37:12 AM

  1. స్మార్ట్ సిటీ నిధులు గ్రామ పంచాయతీకి
  2. రూ. 2 కోట్లతో అభివృద్ధి పనులు
  3. కోర్టును ఆశ్రయించిన కరీంనగర్ మాజీ మేయర్
  4. అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు

కరీంనగర్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా గుర్తించిన అనంతరం నగరంలో ప్రధాన రహదారులతోపాటు జంక్ష న్లు, పార్కుల అభివృద్ధి, గ్రంథాలయంతోపాటు వివిధ పనులను ప్రారంభించారు. రోడ్ల పనులు పూర్తికాగా, జంక్షన్ల అభివృద్ధి చివరి దశకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ. 500 కోట్లతో మొత్తం వెయ్యి కోట్లతో  అభివృద్ధి పనులు ప్రారంభించారు.

అయితే స్మార్ట్ సిటీ నిధులు నగర పరిధిలో ఖర్చు చేయాల్సి ఉండగా, నగరానికి ఆనుకొని ఉన్న బొమ్మకల్ జంక్షన్ అభివృద్ధికి కేటాయించడం వివాదాస్పదమయింది. రాజీవ్ రహదారి ఫ్లు ఓవర్ కింది భాగాన బొమ్మకల్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న జంక్షన్‌ను కోటి రూపాయలతో, దాని చుట్టూ ఉన్న రోడ్లను అభివృద్ధి పర్చేందుకు మరో కోటి రూపాయలతో పనులు ప్రారంభించారు.

ఈ పనులు కొనసాగుతున్న క్రమంలో నిధులను దుర్వినియోగం చేస్తున్నారంటూ కలెక్టర్ స్థాయి నుంచి పైఅధికారుల వరకు మాజీ మేయ ర్ రవీందర్ సింగ్ ఫిర్యాదులు చేశారు. పోలీస్ స్టేష న్‌లో కూడా ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. అయితే అక్కడి నుంచి స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. కేసు నమోదు చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో కరీంనగర్ వన్‌టౌన్‌లో అప్పటి కమిషనర్, ఎస్‌ఈ, స్మార్ట్ సిటీ కన్సల్టెన్సీ ఎండీపై కేసు నమోదు చేశారు. 

హైకోర్టు ఉత్తర్వులు

కరీంనగర్ బల్దియాకు సంబంధం లేని బొమ్మకల్ కూడలి అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆగస్టు 8, 2002లో టెండర్లు కూడా ఆహ్వానించారు. స్మార్ట్ సిటీ కోసం కేటాయించిన నిధులు బల్దియా పరిధిలో వెచ్చించాల్సి ఉన్నప్పటికీ నిబంధనల కు విరుద్ధంగా అధికారులు బొమ్మకల్ జంక్షన్ అభివృద్ధి కోసం నిధులు కేటాయించారు. ఈ విషయంపై బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ మేయర్ రవీందర్‌సింగ్ వన్‌టౌన్ పోలీసులకు జూలై 3, 2024 రోజున ఫిర్యాదు చేసి బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరా రు.

అయితే పోలీసు అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేయకపోవడంతో రవీందర్‌సింగ్ హైకోర్టులో డబ్ల్యూపీ నం. 24150/ 2024 ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. సహజ న్యాయసూత్రాలు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లను ఉల్లంఘించారని వివరించారు. బాధ్యులపై క్రిమినల్ కేసు నమో దు చేయాలని కరీనగర్ వన్‌టౌన్ సీఐని ఆదేశించాలని పిటిషన్‌లో రవీందర్‌సింగ్ కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీచేయడంతో  పోలీసులు క్రైం నం. 480/2024 సెక్షన్ 420, 406ఆర్/డబ్ల్యూ34ఐపీసీ ప్రకారం కేసు నమోదు చేశారు. 

పోరాటం ఆగదు: రవీందర్‌సింగ్

 ఈ వ్యవహారంపై శుక్రవారం మాజీ మేయర్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వల్లే నిధులు దుర్వినియో గం అయ్యాయన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులు ఎవరైనా చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకునే వరకు తన పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.