calender_icon.png 28 October, 2024 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు

28-10-2024 12:24:12 AM

  1. చిలకలగూడ పోలీసులకు హైకోర్టు మొట్టికాయలు
  2. సివిల్ వివాదంలో జోక్యం చేసుకోవడంపై మందలింపు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 27 (విజయక్రాంతి): సివిల్ వివా దంలో పోలీసులు జోక్యం చేసుకొని తనపై అక్రమ కేసులు పెట్టడంతో పా టు రౌడీషీట్ తెరిచారని మామిడిశెట్టి హనుమాన్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు చిలకలగూడ పోలీసు లపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

రౌడీషీట్ స్టే ఉన్నా పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించడం సరికాదని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని హైకో ర్టు వ్యాఖ్యానించింది. బాధితుడు వేసి న రిట్ పిటిషన్‌పై నవంబర్ 6వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డి, సీఐ బి.అనుదీప్, ఎస్‌ఐలు కె.సబిత, జ్ఞానేశ్వర్ గౌడ్, సుధాకర్‌కు కోర్టు నోటీ సులు జారీ చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. సీతాఫల్‌మండికి చెందిన మామిడిశెట్టి హనుమాన్ ఎంబీఏ పూర్తిచేసి చిలకలగూడలో ఓ అపార్ట్‌మెంట్ నిర్మాణం చేపట్టాడు. ఇక్కడ ప్లాట్లు ఖరీదు చేసిన వారి నుంచి డబ్బులు సరిగా రాకపోవడం, వారిచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో వారిపై హనుమాన్ సివిల్ కేసులు వేశాడు.

ఇది జీర్ఞించుకోలేని ప్లాట్ యజమానులు పోలీసులతో కుమ్మక్కై హనుమాన్‌పై 15 రోజుల వ్యవధిలోనే నాలుగు సివిల్ కేసులు నమోదు చేయించారు. ఆ వెనువెంటనే పోలీసులు అతనిపై సస్పెక్ట్ తెరవ కుండానే ఏకంగా రౌడీషీట్ తెరిచారు.  ఈ క్రమంలో తనపై నమోదైన అక్రమ కేసులను కొట్టివేయడంతో పాటు రౌడీ షీట్ కూడా మూసివేయాలం టూ హనుమాన్ హైకోర్టును ఆశ్రయించాడు.

రౌడీషీట్‌పై హైకోర్టు స్టే ఇస్తూ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అలాగే అతడిపై నమోదు చేసిన కేసులపై కూడా చార్జ్జిషీట్లు సమర్పించాలని కోర్టు చిలకలగూడ పోలీసులను ఆదేశించింది.