calender_icon.png 23 February, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్న కూతురుపై అఘాయిత్యం

22-02-2025 01:08:03 AM

* నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష 

*ఫోక్సో కేసుల ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు

నల్లగొండ, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి) : కన్న కూతురుపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి నల్లగొండ జిల్లా ఫోక్సో కేసుల ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి 20 ఏండ్ల జైలు రూ.10 వేల జరిమానా  విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చారు.

కేసు వివరాలివి.. కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామా నికి చెందిన  అక్కెనపల్లి ఆంజనేయులు రెండేండ్ల క్రితం భార్య ఇంట్లో లేని సమయంలో  కుమార్తె (13)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు.సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లికి బాలిక విషయం చెప్పడంతో కట్టంగూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. ఛార్జిషీట్ దాఖలు చేసి కోర్టులో ప్రవేశపెట్టి సరైన ఆధారాలు సమర్పించారు.

దీంతో న్యాయమూర్తి నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. నిందితుడికి శిక్షపడేలా పక్కాగా ఆధారాలు సేకరించిన నాటి విచారణ అధికారి ఎస్.రాఘవరావు, సీ శ్రీనివాస్ రెడ్డి, సీఐలు డీ. రాజు, కొండల్ రెడ్డి, ఎస్‌ఐ ఎం.రవీందర్తోపాటు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్, సీడీఓ రువ్వ నాగరాజు, M.కల్పన, లీగల్ ఆఫీసర్, భరోసా సెంటర్ కోర్టు లైజైనింగ్ ఆఫీసర్లు పి.నరేందర్, ఎన్.మల్లికార్జున్‌ను ఎస్పీ అభినందించారు.