calender_icon.png 3 March, 2025 | 3:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిమాలయాల్లో అఖండ రెక్కీ

02-03-2025 12:43:56 AM

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను ‘అఖండ 2: తాండవం’ కోసం నాలుగోసారి కొలాబరేట్ అయ్యారు. వారి మునుపటి బ్లాక్‌బస్టర్ ‘అఖండ’కు సీక్వెల్‌గా రూపొందుతోందీ సినిమా. సంయుక్త హీరోయిన్ కాగా, ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచం ద్ ఆచంట నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.

ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి శ్రీను హిమాలయాల్లో రెక్కీ చేస్తున్నారు. అక్కడ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి ఆయన ఈ లొకేషన్లను అన్వేషిస్తున్నారని మూవీ యూనిట్ చెబుతోంది. ఈ సన్నివేశాలు చిత్రంలో మెయిన్ హైలైట్ కానున్నాయని వారు పేర్కొన్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్; డీవోపీ: సీ రాంప్రసాద్, సంతోష్ డీ; ఆర్ట్: ఏఎస్ ప్రకాశ్; ఎడిటర్: తమ్మిరాజు; ఫైట్స్: రామ్-లక్ష్మణ్.