25-03-2025 01:23:46 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
కొల్చారం, మార్చి 24: జిల్లాలోని వరి పంటకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కొల్చారం మండలం వరిగుంతం, కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామాలలో రైతులు పండించిన వరి పంట పొలాలను కలెక్టర్ పరిశీలించారు.
దేవులపల్లి గ్రామం జంగం రమేష్ రెండు ఎకరాల వరి పంటను, వరిగుంతం గ్రామం ముత్యం గారి నరసింహులు 3 ఎకరాల వరి పంటను కలెక్టర్ పరిశీలించారు రైతులతో మాట్లాడుతూ పంట కోతకు వచ్చేందుకు పట్టేకాలం, సాగునీరు పొదుపుగా వాడే పద్ధతి, వరి పంటకు ఇంకా ఎన్ని తడులు అవసరమని, గత సంవత్సరం వరి పంట సాగు వివరాలు, ఏ రకం ధాన్యం సాగు చేస్తున్నారని రైతులను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో 2 లక్షల ఎకరాలు వరి సాగు చేయడం జరిగిందని, ఇరిగేషన్ ద్వారా రైతులు వేసిన వరి పంట సమృద్ధిగా సాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.