19-02-2025 01:49:01 AM
* వైద్య,ఆరోగ్యశాఖ ముందస్తు బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
* హాజరైన మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): పేద,మధ్యతరగతి వర్గాలు అత్యధి కంగా ఆధారపడే వైద్య,ఆరోగ్య శాఖకు 2025 అత్యంత ప్రాధాన్యమిస్తామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీకి సమృద్ధిగా కేటాయింపులు ఉంటాయన్నారు. మంగళవారం సచివాలయంలో జరిగిన వైద్య, ఆరోగ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ముందస్తు బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సంద ర్భంగా భట్టి మాట్లాడుతూ.. గత దశాబ్ద కాలంగా డ్రగ్స్, ఫుడ్‌సేఫ్టీ, మెడికల్ ఎడ్యుకేషన్ విభాగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, తమ ప్రభుత్వం ఈ మూడు విభాగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. జిల్లా కేంద్రాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లానిటోరియంలు నిర్మించే ఆలోచనలో ఉన్నామన్నా రు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టంలో వైద్య కళాశాల భవనాలు, ఆస్పత్రుల నిర్మా ణం పనులు పూర్తవుతాయన్నారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టియాన చొంగతా, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, జాయింట్ సెక్రెటరీ హరిత పాల్గొన్నారు.