calender_icon.png 19 November, 2024 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరనాథ్ యాత్ర నిలిపివేత

13-08-2024 12:20:13 AM

భారీ వర్షాలతో అధికారుల నిర్ణయం

శ్రీనగర్, ఆగస్టు 12: జమ్ముకశ్మీర్‌లోని మంచుకొండల్లో సాగుతున్న పవిత్ర అమరనాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. భారీ వర్షాలకారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో బాల్తాల్ మార్గంలో సోమవారం యాత్ర నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. పహల్గావ్ మార్గంలో యాత్రను గత మంగళవారమే నిలిపవేశారు. మంచుగుహకు వెళ్లే ఈ మార్గాన్ని మెయింటనెన్స్ కోసం మూసివేసినట్టు కశ్మీర్ డివిజనల్ కమిషనర్ వీకే భిదూరి తెలిపారు. ఈ రెండుమార్గాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఈ యాత్రలో ఇప్పటికే 5.10 లక్షల మంది భక్తులు మంచు మహా లింగాన్ని దర్శించుకొన్నారు. జూన్ 29న ప్రారంభమైన ఈ యాత్ర ఈ నెల 19న ముగుస్తుంది.