22-03-2025 07:03:26 PM
ఐదు నెలల పసికందు మృతదేహం లభ్యంతో కేసు పురోగతి...
ఆర్ఎంపీ డాక్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఐదు నెలల గర్భవతిగా ఉన్న మైనర్ బాలికకు తన అర్హతకు మించి వైద్యం అందించి అబార్షన్ చేయడంతో పాటు బాధితురాలు అస్వస్థతకు గురికావడానికి కారణమైన ఆర్ఎంపీ డాక్టర్ సూర్యవంశీ దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉట్నూర్ ఎఎస్పీ కాజల్ సింగ్ తెలిపిన వివరాల మేరకు.. గుడిహత్నూర్ మండలం గురజ గ్రామంలో ఇటీవల పసికందు మృతదేహం లభ్యంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారభించారు. 15 ఏళ్ల మైనర్ బాలిక గర్భం దాల్చగా, ఐదు నెలల సమయంలో గర్భం పోవడానికి కావలసిన టాబ్లెట్ లను చట్ట వ్యతిరేకంగా ఇచ్చినందుకు డాక్టర్ సూర్యవంశీ దిలీప్ పై ఎంపీపీ ఆక్ట్ కింద కేసు నమోదు, శనివారం పోలీస్ అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. జిల్లా వైద్య శాఖ అందించిన సమాచారం మేరకు డాక్టర్ కు అర్హత లేదని తెలిసిన వెంటనే డాక్టర్ పై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎఎస్పీ హెచ్చరించారు.