హైకోర్టు తీర్పు
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): చిన్న పత్రికల్లో పనిచేసే వారికి అక్రిడేషన్ కార్డుల జారీలో ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను హైకోర్టు రద్దు చేసింది. చిన్న పత్రికలను ఏ, బీ, సీ, డీ వర్గాలుగా కేటాయించడం ద్వారా జిల్లా, నియోజకవర్గాల్లో పనిచేసే వారికి అక్రి డేషన్ల ప్రయోజనం అందడంలేదని పేర్కొంది. ఈ నిబంధనను రద్దు చేస్తూ రెండు నెలల్లో తాజాగా నిబంధనలు రూపొందించాలని ప్రభు త్వానికి ఆదేశాలు జారీచేసింది.
పారదర్శకంగా, సహేతుకమైన నిబం ధనలు రూపొందిడచం ద్వారా జిల్లా, నియోజకవర్గాల్లో చిన్న పత్రికల జర్నలిస్టులకు ప్రయోజనాలు కల్పించాలని ఆదేశించింది. అక్రిడిటేషన్ జారీకి సంబంధించి 2016లో జారీ చేసిన జీవో 239లోని షెడ్యూలులోని నిబంధనలను కొట్టివే యాంటూ మహబూబ్‌నగర్‌కు చెం దిన టీ కృష్ణ మరో ముగ్గురు 2016 లో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాస్‌రావుతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. చిన్న పత్రికలను విభజించడానికి ప్రభుత్వం సహేతుక కారణాలను పేర్కొనలేదని,
ఆ నిబంధనలు చెల్లవంటూ
కొట్టివేసింది. రెండు నెలల్లో చిన్న పత్రికల జిల్లా, నియోజకవర్గ విలేకరులకు ప్రయోజనం కలిగించేలా మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశిం చింది.