calender_icon.png 14 October, 2024 | 8:14 AM

జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత

14-10-2024 03:30:44 AM

గెజిట్ జారీచేసిన కేంద్రం

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: జమ్ముకశ్మీర్‌లో 2019 నుంచి కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీంతో కశ్మీర్‌లో ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్సీ ప్రభుత్వం కొలువుదీరేందుకు మార్గం సుగమమైంది. జమ్ముకశ్మీర్ పునర్విభజన చట్టం సెక్షన్ 73 ప్రకారం కేంద్రపాలిత ప్రాంతంలో 2019 అక్టోబర్ 31 నుంచి అమలు చేస్తున్న రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నాం.

సెక్షన్ 54 ప్రకారం ముఖ్యమంత్రి నియామకానికి ముందే కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన రద్దవుతుంది నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదం తెలిపారు. ఇటీవల జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి కానున్నారు.