calender_icon.png 2 February, 2025 | 7:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల కోడ్ తో ప్రజావాణి రద్దు

02-02-2025 04:19:17 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి కలెక్టరేట్ లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.