* 5, 8వ తరగతులకు వర్తింపు
* వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయితే తిరిగి రెండు నెలల్లో పరీక్షలు
* రెండోసారి కూడా ఫెయిల్ అయితే ఇక ‘నో ప్రమోట్’
* పాత తరగతికే విద్యార్థి పరిమితం
* దేశ్యాప్తంగా 3 వేల కేంద్రీయ, సైనిక్, నవోదయ విద్యాలయాలకు వర్తింపు
న్యూఢిల్లీ, డిసెంబర్ 23: స్కూల్‌స్థాయి విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్రీయ, నవోదయ, సైనిక్ పాఠశాలల్లో 5, 8వ తరగతులకు సం బంధించిన నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. 2019లో విద్యాహక్కు చట్టానికి కేంద్రం సవరణలు చేయగా, దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతా లు ఇప్పటికే ఈ రెండు తరగతుల్లో నో డిటెన్షన్ విధానాన్ని తొలగించాయి.
దీంతో 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆ సం వత్సరం వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయితే, రెండు నెలల్లో మళ్లీ పరీక్ష రాయాల్సి ఉం టుంది. ఆ పరీక్షల్లో కూడా వారు ఫెయిల్ అయితే మళ్లీ పాత తరగతికే పరిమితం కావాల్సి ఉంటుంది. సాధారణంగా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు పాస్ అయినా, ఫెయిల్ అయి నా యాజమాన్యాలు పైతరగతికి ప్రమోట్ చేస్తుంటాయి.
కేంద్రం తీసుకున్న నిర్ణయం తో ఇకపై 5, 8వ తరగతులు చదివే విద్యార్థు లు కచ్చితంగా పరీక్షలు పాస్ కావాల్సి ఉం టుంది. కానీ, ఫెయిల్ అయిన విద్యార్థిని ఎట్టిపరిస్థితుల్లోనూ తరగతి నుంచి బహిష్కరించొద్దని యాజమాన్యాలను ఆదేశించింది. మరోవైపు.. పాఠశాల విద్య రాష్ట్ర జాబితాలో ని అంశం కాబట్టి, ఆయా రాష్ట్రాలు ఇప్పటికే 5, 8వ తరగతుల్లో నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేశాయి. హర్యానా, పుదుచ్చేరి ప్రభుత్వాలు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణ యం తీసుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లో నో డిటెన్షన్ విధానమే కొనసాగుతున్నది.
రెండు నెలల్లో మళ్లీ పరీక్షలు..
నోడిటెన్షన్ రద్దు అంశంపై సెంట్రల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లిట్రసీ సెక్రటరీ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ.. పాఠశాల విద్యను బలోపేతం చేసే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం 5, 8వ తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసిందని స్పష్టం చేశారు. ఆయా తరగతులు చదువుతున్న విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయితే, రెండు నెలల్లో మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
ఆ పరీక్షల్లోనూ ఫెయిల్ అయితే సదరు విద్యార్థి ప్రమోట్‌కు అర్హుడు కాదని తేల్చిచెప్పారు. ఈ నిబంధనలు దేశవ్యాప్తంగా కేంద్రీ య, నవోదయ, సైనిక్ విద్యాలయాల్లో అమలవుతాయని వెల్లడించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తిస్తామన్నారు.