calender_icon.png 28 October, 2024 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళ హత్య కేసులో యావజ్జీవ శిక్ష రద్దు

10-08-2024 01:23:31 AM

సాక్ష్యాలకు పొంతన లేదన్న హైకోర్టు

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): మహిళ హత్య కేసులో నింది తుడికి మహబూబ్‌నగర్ కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను హైకోర్టు రద్దు చేసింది. ఈ కేసు విచారణలో కింది కోర్టు సాక్ష్యాధారాల ప్రాతిపదికపై కాకుండా నైతిక సాక్ష్యాధారాలను ప్రామాణికంగా తీసుకోవడాన్ని ఆక్షేపించింది. ప్రాసిక్యూషన్ సమ ర్పించిన సాక్ష్యాధారాలకు పొంతన లేదని జస్టిస్ కే సురేందర్, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ తెలిపింది.

మహబూబ్‌నగర్ జిల్లా కోడూరుకు చెందిన ఆటోడ్రైవర్ వడ్డె రాజుకు కింది కో ర్టు విధించిన శిక్షను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. సందేహాలకు ఆస్కారం లేకుండా నేరారోపణలకు సాక్ష్యాధారాలు ముఖ్యమని పేర్కొంది. కచ్చితమైన సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచటంలో ప్రాసి క్యూషన్ విఫలమైందని ఆక్షేపించింది. చట్ట ప్రకారం అనుమతించని రీతిలో నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని 2015లో కింది కోర్టు విధించిన శిక్ష చెల్లదని ప్రకటించింది. ఈ తీర్పుతో పదేళ్లుగా జైల్లో ఉన్న నిందితుడు విడుదల కానున్నాడు. 

ఇదీ కేసు..

2014 ఏప్రిల్ 28న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అప్పాయిపల్లి సరిహద్దులో శాంతమ్మ అనే మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. అది తన తల్లిదేనని ఆమె కొడుకు నిర్ధారించాడు. అదే ఏడాది జూన్ 25న పోలీసులు వడ్డె రాజును అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి శాంతమ్మ కాలి పట్టీలు, ఇతర నగలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో తాను పలు వురు మహిళల హత్య కేసులో పాల్గొన్నట్లు నిందితుడు అంగీకరిస్తూ వాం గ్మూ లం ఇచ్చాడు. ఈ కేసులో మహబూబ్‌నగర్ అదనపు సెషన్స్ జడ్జి నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించారు. నగదు చోరీ కేసులో రెండేళ్లు, సాక్ష్యాలు ధ్వంసం చేసిన కేసులో మరో మూడేళ్లు శిక్ష విధించారు. ఈ తీర్పును వడ్డె రాజు హైకోర్టులో సవా ల్ చేశాడు.

క్రిమినల్ అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ కేసు విచారణ సరిగా సాగలేదని ధర్మాసనం గుర్తిం చింది. తల్లి మృతదేహాన్ని ఎప్పుడు కనుగొన్నారో కుమారుడు చెప్పడం లేదు. హైదరాబాద్‌లో ఉన్న తనకు 2014 మే 7న తల్లి చనిపోయినట్లు తెలిసిందని కొడు కు పోలీసులకు చెప్పాడు. దీనికితోడు ఇంక్వెస్ట్ రిపోర్టులో కూడా కొడుకు పేరు లేదు. మే 7న శాంతమ్మ చనిపోయినట్లు తెలిసిందని చెప్పేటప్పుడు ఏప్రిల్ 20న మతదేహాన్ని గుర్తించినట్లు చెప్పడంలో వాస్తవం లేదు. పోలీసులు 2014 సెప్టెంబర్ 20న పంచనామా నిర్వహించినప్పు డు శాంతమ్మ కాలి పట్టీలను గుర్తించినట్లు చెప్పారు. మరో సందర్భంగా నిందితుడిని జూన్ 25న పట్టుకున్నప్పుడే శాంతమ్మ కాలి పట్టీలను గుర్తించామన్నా రు. ప్రాసిక్యూషన్‌లో లోపాలు కొట్టొచ్చినట్లు కనబ డుతున్నాయి. కేవలం నిందితుడు అంగీక రించాడని చెప్పి సీరియల్ కిల్లర్‌గా నిర్ధారించి యావజ్జీవ శిక్ష విధించడం చెల్లదు అని హైకోర్టు తీర్పు వెలువరించింది.