calender_icon.png 21 November, 2024 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల అక్రమ భూక్రమబద్ధీకరణ రద్దు

12-09-2024 01:54:40 AM

వెలుగులోకి అదనపు కలెక్టర్ ఉత్తర్వులు 

నల్లగొండ, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ఎనిమిది మంది జర్నలిస్టులు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి చేసుకున్న ప్రభుత్వ స్థల క్రమబద్ధీకరణను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు గత నెల 14న అదనపు కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులు బుధవారం బహిర్గతమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో జీవీ 59ను అడ్డుపెట్టుకొని నాయకుల అండతో ఎనిమిది మ ంది జర్నలిస్టులు పానగల్ గ్రామ పరిధిలోని ఏఎమ్మార్పీ ఎస్సెల్బీసీకి చెందిన రూ.10 కోట్ల విలువైన భూమిని గతేడాది అక్రమం గా క్రమబద్ధీకరించుకున్నారు.

జర్నలిస్టు సంఘాలు ఆందోళనకు దిగడంతో నాటి కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విచారణ జరిపిన అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అక్రమాలను ని గ్గు తేల్చి భూ కేటాయింపులు రద్దు చేయాల ని సీసీఎల్‌ఏకు నివేదించారు. సీసీఎల్‌ఏ ఆ దేశాలకు అనుగుణంగా జర్నలిస్టులకు కేటాయించిన భూమిని రద్దు చేస్తూ గత నెల 14 న ఉత్తర్వులిచ్చారు. పలు కారణాలతో ఈ ఉ త్తర్వులు బహిర్గతం కాలేదు. నల్లగొండ జర్నలిస్టు హౌజింగ్ సొసైటీ ఇటీవల కలెక్టర్, ఎ స్పీకి ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పం దించి ఉత్తర్వుల కాపీని బహిర్గతం చేసినట్లు తెలిసింది.  

యూట్యూబ్ చానల్ రిపోర్టర్‌పై కేసు

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): ఓ వ్యాపారిని డబ్బుల కోసం బెదిరి ంచిన యూట్యూబ్ చానల్ రిపోర్టర్‌ను మహేశ్వరం ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా కీసరకు చెందినసై యూ ట్యూబ్ చానల్ రిపోర్టర్‌గా మధుసూదన్‌రెడ్డి పనిచేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంప ట్నం మండల పరిధిలోని చింతపల్లిగూడలో ని బిస్లరీ వాటర్ తయారీ కంపెనీ యజమానికి ఫోన్ చేసి వాటర్ బాటిళ్లలో ఈగలు వ స్తున్నాయని, తన యూట్యూబ్ చానల్‌లో ప్రసారం చేస్తానని పలుమార్లు బెదిరించాడు.

రూ.10 లక్షలు ఇస్తే ప్రచారాన్ని మానేస్తానని డిమాండ్ చేశాడు. కంపెనీ యజమాని రూ.2 లక్షలు ఇస్తానని చెప్పి కంపెనీ వద్దకు సోమవారం రాత్రి పిలిచారు. కంపెనీ మేనేజర్ కృష్ణ మహేశ్వరం ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందించారు. కంపెనీ వద్దకు వ చ్చిన మధుసూదన్‌రెడ్డిని వారు అదుపులోకి తీసుకున్నారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మీడియా పేరుతో మహిళ అక్రమాలు

రాజన్న సిరిసిల్ల(విజయక్రాంతి): మీడియా పేరుతో అక్రమాలకు పాల్పడిన మహిళను, ఆమెకు సహకరించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వేములవాడ ఏఎస్పీ శేషా ద్రినిరెడ్డి తెలిపారు. చింతల్‌ఠాణా గ్రామానికి చెందిన సీహెచ్ వనజ తాను మీడియాలో పనిచేస్తున్నానని వేములవాడ చుట్టు పక్కల గ్రామాలకు చెందిన యువకులను నమ్మించింది. వారిని కూడా రిపోర్టర్లుగా చేర్పిస్తానని, అక్రిడేషన్ కార్డుతో పాటు ప్రభుత్వ భూ ములు ఇప్పిస్తానని నమ్మించింది.

మల్యాల గ్రామానికి చెందిన రొండి చంద్రయ్య నుంచి రూ.16లక్షలు తీసుకుంది. చందుర్తి మండలంలోని రామన్నపేటకు చెందిన ఆరుట్ల ఆది మల్లయ్యకు 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇప్పిస్తామని రూ.10లక్షలు తీసుకుంది. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వనజతోపాటు ఆమెకు సహకరించిన మాల్యాల గ్రామానికి చెందిన పీసరి శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు.