calender_icon.png 27 January, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోడు పదవులకు స్వస్తి

27-01-2025 12:46:17 AM

  1. ఒకరికి ఒకే పదవి ఉండాలని నిర్ణయం
  2. ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లను పార్టీ పదవుల్లో పరిగణలోకి తీసుకోవద్దు 
  3. రెండు పదవుల విషయంలో పీసీసీ చీఫ్‌కు మాత్రమే మినహాయింపు
  4. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ అధిష్ఠానం సూచన 
  5.  కొత్త జట్టులో సామాజిక న్యాయం 
  6. పార్టీ కోసం శ్రమించిన వారికే చోటు 

హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్‌కు త్వరలోనే నూతన కార్యవర్గం ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. అధిష్ఠానం కూడా వేగంగా నూతన కమిటీ ఏర్పాటు చేయాలని ఇప్పటికే సూచనలు చేసింది. దీంతో  కొందరు ప్రజాప్రతినిధులు పార్టీ పదవుల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

అయితే అధిష్ఠానం జోడు పదవులకు స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిం ది.  ఒకరికి ఒకే పదవి ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నా యి. ఇదే అంశాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చా ర్జి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేసినట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నా యి.

పీసీసీ కొత్త జట్టులో అవకాశం ఇవ్వాలని  ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరికీ వారు ప్రయత్నా లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అధిష్ఠా నం మాత్రం ప్రజాప్రతినిధులకు ఇవ్వొద్ద ని, పార్టీ కోసం శ్రమించిన వారికే కట్టబెట్టాలనే ఆలోచనతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

కొత్త పీసీసీ చీఫ్ వ చ్చాక.. పాత కార్యవర్గం సాధారణంగా రద్దవుతుంది. నూతన జట్టు వచ్చేవరకు పా త కమిటీ కొనసాగుతోందని పీసీసీ అధ్యక్షు డు మహేశ్‌కుమార్ ఇప్పటికే ప్రకటించారు. 

పదవుల్లో సామాజిక న్యాయం..

కొత్త జట్టు ఏర్పాటుకు పార్టీ అధిష్ఠానం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో.. నూతన కార్యవర్గ కూర్పునకు రాష్ట్ర కాంగ్రెస్  కసరత్తు చేస్తోంది. గత పీసీసీ కమిటీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా నలుగురు ఉన్నారు. కొత్త కార్య వర్గంలో ముగ్గురు లేదా నలుగురికి వర్కింగ్ పదవులు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ బీసీ కావడంతో.. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల్లో సామాజిక న్యాయం పాటించాలనే ఆలోచనతో ఉన్నారు.

అందులో ఓసీ, ఎస్సీ, ఎస్టీతో పాటు మైనార్టీ వర్గానికి వర్కింగ్ పోస్టులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ వర్కింగ్ పోస్టుల  కోసం పార్లమెంట్ సభ్యులు, కొందరు ఎమ్మెల్యేలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవుల కోసం పోటీపడుతున్నారు. ఒకవైపు  ప్రజాప్రతినిధిగా ఉండి మరో వైపు పార్టీ పదవి ఉంటే పార్టీ అధిష్ఠానానికి మరింత దగ్గర కావొచ్చనే అభిప్రాయంతో ఉన్నట్లు ప్రచారం జరుగు తోంది.

నాగర్‌కర్నూల్, భువనగిరి ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొంద రు ఎమ్మెల్యేలు డీసీసీ అధ్యక్ష పదవి కావాలని కోరుకుంటున్నారు.  దీంతో ప్రజా ప్రతినిధులుగా ఉండి మరోవైపు పార్టీ పదవులు కోరుకోవడంపై పార్టీలోని మిగతా నా యకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు తప్ప మిగతా వారు ఎవరికీ రెండు పదవులు ఉండొద్దని అధిష్ఠానం సూచించినట్టు చెబుతున్నారు. మహేశ్‌కుమార్‌గౌడ్ ఎమ్మెల్సీగా ఉన్న విషయం తెలిసిందే. 

పార్టీ కోసం శ్రమించిన వారికే.. 

పార్టీ పదవులను పార్టీ కోసం శ్రమించిన వారిని గుర్తించి పదవులు ఇవ్వాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం రాని వారని, నామినేటెడ్ పదవుల్లో స్థానం దక్కని వారికి పార్టీ పదవులు కట్టబెట్టాలనే ఆలోచనతో ఉన్నారు.  అంతేకాకుండా పదవుల పందేరంలో సామాజిక న్యాయం పాటించాలనే నిర్ణయానికి వచ్చారు.

మంత్రులు, నామినేటెడ్ పదవుల్లో అవకాశం దక్కని సామాజికవర్గాలకు పార్టీ పదవుల్లో ఎక్కువగా స్థానం కల్పిస్తే.. కొంతమేర ఆ వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా ఉంటుందని అభిప్రాయంతో ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్, పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో పాటు డీసీసీ కార్యవర్గంతో చాలామంది నాయకులకు పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.