calender_icon.png 15 January, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బీజేపీ మైనార్టీ మోర్చా’ను రద్దు చేయండి!

18-07-2024 12:05:00 AM

కార్యకర్తలు ‘సబ్ కా వికాస్.. సబ్ కా సాథ్’ అని నినదించొద్దు

పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు వివాదాస్పద వ్యాఖ్యలు

కోల్‌కతా, జూలై 17:బీజేపీ మైనార్టీ మోర్చాను రద్దు చేయాలని, కార్యకర్తలు ఇకపై ‘సబ్ కా వికాస్.. సబ్ కా సాథ్’ అని నినదించొద్దని, దాని స్థానంలో ‘జో హమారే సాథ్.. హమ్ ఉన్‌కే సాథ్ (మన వెంట ఉన్నవారికే మన డ)’ అనే నినాదాన్ని వాడాలని పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి పిలుపునిచ్చారు. కోల్‌కతాలో మంగళవా రం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘జాతీయవాద ముస్లింల గురించి నేను మాట్లాడితే.. మీరంతా ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ అని నినదించేవారు. ఇక నుంచి నేను ఆ నినాదాన్ని పలకను. నేను ‘జో హమారే సాథ్.. హమ్ ఉన్‌కే సాథ్’ అనే కొత్త నినాదాన్నే ఎత్తుకుంటాను. ఇక నుంచి మన పార్టీకి మైనార్టీ మోర్చా విభాగం’  అవసరం లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో మొత్తం 42 సీట్లలో కేవలం 12 సీట్లు మాత్రమే సాధించగలిగింది. ఇటీవల జరిగిన నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లోనూ అధికార పార్టీ టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది.