19-04-2025 04:21:28 PM
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి రిటైర్డు కార్మికుల సుదీర్ఘ కళ నెరవేర్చేందుకు కృషి చేసిన పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ(MP Vamsi Krishna) చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం బి1 ఆఫీస్ వద్ద పార్టీ శ్రేణులు శనివారం పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్ మాట్లాడుతూ... సింగరేణి రిటైర్మెంట్ కార్మికుల పెన్షన్ పెంపుదల కోసం గత సంవత్సరం నుండి పార్లమెంటులో పోరాటాలు చేస్తున్న గడ్డం వంశీకృష్ణ కృషి వల్ల ఈరోజు 140 కోట్ల నిధులు కేంద్రం కేటాయించిందని ఆన్నారు.
మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సొత్కు సుదర్శన్ మాట్లాడుతూ.. బొగ్గు గనీ కార్మికుల పెన్షన్ పెంపు కోసం ఎంపి వంశీ పోరాటాలతోనే సాధ్యమైందన్నారు. గతంలో కాకా వెంకటస్వామి సింగరేణి రిటైర్మెంట్ కార్మికులకు పెన్షన్ పథకం ప్రారంభించారని గుర్తు చేశారు. 35 సంవత్సరాల తర్వాత 500,1000 రూ. పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ కార్మికులకు 10,000 రూ.పెన్షన్ ఇవ్వాలని కేంద్రం మీద ఒత్తిడి చేస్తున్నారని ఆన్నారు. ఇది ఎంపి కృషి వల్లనే సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయ కులు పుల్లూరు లక్ష్మణ్, గుడ్ల రమేష్, మంద తిరుమల్ రెడ్డి, నెరువట్ల శ్రీనివాస్, పైడిమల్ల నర్సింగ్, గడ్డం రజని, ఎర్ర రాజు, మంకు రమేష్, పాషా, జమీల్, యూత్ కాంగ్రెస్ నాయకులు రాయబారపు కిరణ్, మాయ తిరుపతి, అర్జున్, జావిద్, సంతోష్, శీను, ఖలీల్, రవి కిరణ్, సుజిత్, అన్వేష్, గణేష్ లు పాల్గొన్నారు.