20-03-2025 10:41:32 PM
కోదాడ (విజయక్రాంతి): మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం లభించిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ కోదాడ మండల ఉపాధ్యక్షులు సురవరపు వంశీ మాదిగ మాట్లాడుతూ... మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల ఉద్యమ పోరాటానికి అలుపెరుగని పోరాటం చేస్తున్న ఎంఆర్పిఎస్ నాయకులు ఎస్సీ వర్గీకరణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన అమరవీరులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర సబ్ కమిటీ చైర్మన్ భారీ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పులి తిరుపతి, బాబు, పులి ప్రవీణ్, పులిసుందర్రావు, పున్నయ్య, ఇస్సాకు మైసయ్య, నాగ శేఖర్, రమేష్, గురవయ్య, శ్రీను, రవీందర్, రంగయ్య, వీరబాబు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.