20-03-2025 10:19:36 PM
కామారెడ్డి (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ కోసం 40 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కృషితో రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం లభించిందని, గురువారం ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రశాంత్ కుమార్ అన్నారు. భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డిలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద మందకృష్ణ మాదిగ చిత్రపటానికి ఎమ్మార్పీఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.