calender_icon.png 2 April, 2025 | 3:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభినవ్.. సాహస బాలుడి కథ

25-03-2025 12:00:00 AM

సందేశాత్మక బాలల చిత్రాలతో సినీప్రియుల ప్రశంసలు అందుకున్నారు దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్. ఆయన నుంచి వస్తున్న మరో బాలల  చిత్రమే ‘అభినవ్’. ఈ చిత్రంలో సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్, గీతా గోవింద్, అభినవ్, చరణ్, బేబీ అక్షర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో దర్శక, నిర్మాత భీమగాని సుధాకర్‌గౌడ్ మాట్లాడారు. ‘స్వాతంత్య్ర సమరయోధుడైన తన తాతయ్య స్ఫూర్తితో సాహస బాలుడు గంజాయి మాఫియా ఆట ఎలా కట్టించాడనేది ఈ చిత్రంలో చూపిస్తున్నాం’ అని చెప్పారు.