calender_icon.png 13 March, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారులు ఛేదించిన పద్మవ్యూహం అభినవ్

12-03-2025 12:00:00 AM

శ్రీలక్ష్మి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిల్మ్ నిర్మిస్తున్న బాలల చిత్రం ‘అభినవ్: చేజ్డ్ పద్మవ్యూహ’. ఈ చిత్ర పోస్టర్, ట్రైలర్‌ను తెలంగాణ రాష్ర్ట మం త్రి కొండా సురేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడు తూ.. “ప్రస్తుత పరిస్థితులకు అనుగుణం గా సుధాకర్ గారు ఈ చిత్రాన్ని నిర్మించా రు. ఇలాంటి చిత్రాలకు ప్రభుత్వ సహకారం తప్పకుండా ఉంటుంది. డ్రగ్ మాఫియా విద్యార్థులను సైతం వడలడంలేదు.

చిత్ర ట్రైలర్ ఎంతో ఇన్స్పురింగ్‌గా ఉంది” అన్నారు. చిత్ర దర్శకనిర్మాత భీమగాని సుధాకర్ మాట్లాడుతూ.. “గంజాయి, డ్రగ్స్ వలలో చిక్కుకున్న అనాథ గిరిజన పిల్లలను.. హైదరాబాద్‌లోని ప్రముఖ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులు ఎలా రక్షించారు? గంజాయి, డ్రగ్ మాఫియా పద్మవ్యూహంలోకి చిన్నారులు ఎలా ఎంటరై అంతం చేశారు?” అనే కధాంశంతో చిత్రం ఉంటుంది అన్నారు. ఈ చిత్రాన్ని తెలంగాణ విద్యార్థులకు అతి త్వరలో నూన్ షోగా థియేటర్లలో చిత్రం విడుదల చేయబోతున్నట్లు నిర్మాత, దర్శకుడు డా. భీమగాని సుధాకర్ గౌడ్ వెల్లడించారు.