calender_icon.png 18 November, 2024 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశభక్తిని ప్రేరేపించే అభినవ్

16-11-2024 12:00:00 AM

ఆదిత్య’, ‘విక్కీస్ డ్రీమ్’, ‘డాక్టర్ గౌతమ్’ వంటి సందేశాత్మక బాలల చిత్రాలతో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు దర్శక నిర్మాత భీమగాని సుధాకర్‌గౌడ్. ఆయన దర్శకత్వంలో సంతోష్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్న మరో బాలల లఘుచిత్రం ‘అభినవ్’. ఈ చిత్రంలో సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్, గీతా గోవింద్, అభినవ్, చరణ్, బేబీ అక్షర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో దర్శక, నిర్మాత భీమగాని సుధాకర్‌గౌడ్ చిత్ర విశేషాలను వెల్లడించారు. ‘పిల్లల్లో చిన్నప్పటి నుంచే దేశభక్తిని రూపొందించాలనే లక్ష్యంతో ఈ సినిమాను రూపొందించాను. విదేశాల్లో పిల్లలకు చిన్నప్పట్నుంచే దేశ రక్షణ విషయంలో అవగాహన కల్పించి, శిక్షణ ఇస్తుంటారు. అలా మన పిల్లలను కూడా తీర్చిదిద్దాలి.

దురదృష్టవశాత్తూ పిల్లలు గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. డ్రగ్ మాఫియా మన గ్రామీణ ప్రాంతాల్లోనూ బాగా విస్తరించింది. ఎన్‌సీసీ, స్కౌట్స్, యోగ, ధ్యానం నేర్చుకోవడం ద్వారానే పిల్లలు ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండగలరు. దేశ రక్షణలో భాగం కాగలరు. ఇలాంటి స్ఫూర్తికరమైన అంశాలతో బాలలను గొప్ప మార్గంలో పయనించేలా ఉత్తేజపరుస్తూ ‘అభినవ్’ చిత్రాన్ని రూపొందించాం’ అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, రెడ్‌క్రాస్ సొసైటీ ప్రాజెక్ట్ చైర్మన్ విజయభాస్కర్, చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నిర్మాత లయన్ సాయివెంకట్,  నటుడు బాలాజీ, సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీపూజ, చిత్రబృందం పాల్గొన్నారు.