calender_icon.png 10 October, 2024 | 6:48 AM

అభిమన్యు ఈశ్వరన్ సెంచరీ

04-10-2024 12:00:00 AM

లక్నో: ఇరానీ కప్‌లో భాగంగా ముంబై, రెస్టాఫ్ ఇండియా మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. రెస్టాఫ్ ఇండియా మరో 248 పరుగులు వెనుకబడి ఉంది. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (151*) అజేయ సెంచరీ సాధించగా.. అతనికి తోడు గా ధ్రువ్ జురేల్ (30*) క్రీజులో ఉన్నాడు.

కెప్టెన్ రుతురాజ్ 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరగా.. ఇషాన్ 38 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో మోహిత్ అవస్తి 2 వికెట్లు తీశాడు. అంతకముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగులకు ఆలౌటైంది. క్రితం రోజు స్కోరుకు ఒక్క పరుగు మాత్రమే జత చేసిన ముంబై చివరి వికెట్‌ను కోల్పోయింది.

సర్ఫరాజ్ ఖాన్ (222*) అజేయ డబుల్ సెంచరీతో నాటౌట్‌గా నిలవగా.. చివర్లో తనుశ్ కొటియన్ (64) అర్థ సెంచరీతో రాణించాడు. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, ప్రసిధ్ చెరో 2 వికెట్లు తీశారు.