calender_icon.png 8 October, 2024 | 1:02 AM

‘అభిమాని’ గ్లింప్స్ విడుదల

06-10-2024 12:00:00 AM

సినీ నిర్మాత సురేశ్ కొండేటి హీరోగా ‘అభిమాని’ అనే పేరుతో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్’ అనేది ట్యాగ్‌లైన్. భూలోకం, యమలోకం చుట్టూ తిరిగే కథలో ఈ చిత్రానికి రాంబాబు దోమకొండ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌కే రెహమాన్, కంద సాంబశివరావు నిర్మాతలు. అక్టోబర్ 6వ తేదీ సురేశ్ కొండేటి పుట్టినరోజు. ఈ క్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా మేకర్స్ మూవీ గ్లింప్స్‌ను శనివారం విడుదల చేయించారు. అక్సాఖాన్, రాంబాబు పాల్గొన్నారు.