జుక్కల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఉమ్మడి నిజాంసాగర్ మండలం నర్వ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన కండె బొల్లారం రాజా గౌడ్, స్వరూప దంపతుల రెండో కుమారుడైన అభిలాష్ గౌడ్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. సీఎం కప్ కబడ్డీ పోటీల్లో తనదైన శైలిలో ప్రతిభ కనబర్చాడు. మండల స్థాయి నుండి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడంతో అటు మండల ప్రజలు, గ్రామస్తులు అభిలాష్ గౌడ్ ని సన్మానిస్తూ, అభినందనలు తెలిపారు. తనకు ఇష్టమైన కబడ్డీలో సాధన చేస్తూ జిల్లాస్థాయిలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ఎంపికవడం సంతోషంగా ఉందని అభిలాష్ గౌడ్ పేర్కొన్నాడు.