29-03-2025 06:20:11 PM
ఉత్తర్వులు జారీ చేసిన రవాణా శాఖ..
జనగామ (విజయక్రాంతి): రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ(ఆర్టీఏ) జనగామ జిల్లా మెంబర్గా ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు అభిగౌడ్కు అవకాశం దక్కింది. ఆయనను జిల్లా మెంబర్గా నియమిస్తూ రాష్ట్ర రవాణా శాఖ ఈ నెల 25న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఉత్తర్వు కాపీని అభిగౌడ్ అందుకున్నారు. ఆర్టీఏ కమిటీకి చైర్మన్గా జిల్లా కలెక్టర్ వ్యవహరించనుండగా... మెంబర్ సెక్రటరీగా డీటీవోను నియమించారు. వీరికి తోడుగా అభిగౌడ్కు సభ్యుడిగా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రెండేళ్ల పాటు ఆయన ఈ హోదాలో కొనసాగనున్నారు. తన ఈ అవకాశం కల్పించినందుకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్కు అభిగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీఏ సేవలను మరింత ప్రజలకు చేరువ చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తానని అన్నారు.