calender_icon.png 19 April, 2025 | 12:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

108 కలశాలతో అభయాంజనేయ వార్షికోత్సవం

14-04-2025 01:37:20 AM

కామారెడ్డి, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని స్వప్నలోక్ కాలనీలో అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ, యజ్ఞం  సంపత్ కుమార్ శర్మ ,అర్చకులు సతీష్ పాండే, అజయ్ పాండే, సాయికుమార్ శర్మ, ల ఆధ్వర్యంలో ఆలయంలో విశేష పూజలు యజ్ఞ హోమం ,పూర్ణాహుతి, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. 108  కలశలతో మహిళలు ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని కుంకుమ పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ  గంగవరం ఆంజనేయ శర్మ మాట్లాడుతూ కాలనీ పేరే స్వప్నలోక్ అని పేరు పెట్టుకోవడం చాలా అద్భుతంగా ఉందని, సంవత్సరం కాలంలోనే ఎంతో అత్యంత వైభవంగా నిర్మాణం అభివృద్ధి చేసుకోవడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా, కాలనీవాసు ఇల్లు వేద పండితులు బ్రహ్మశ్రీ ఆంజనేయ శర్మ శాలువాతో సన్మానించారు. పోయేటప్పుడు మన వెంట ఏమి తిసుక వెళ్ళలేమని ఉన్నన్ని రోజులు  బాగుండాలని ,తోచిన కాడికి సహాయం చేస్తూ అందరితో మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు.

అంతేకాకుండా మన పిల్లలకు మంచి మాటలు మంచి బుద్దులు నేర్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో  ఎస్పీఆర్ స్కూల్ యజమాన్యం ప్రతినిధి కొమ్మిరెడ్డి మారుతి, ఆలయ కమిటీ అధ్యక్షులు పవన్ కుమార్ శర్మ, కాలనీ అధ్యక్షులు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు రమాశంకర్, కోశాధికారి సతీష్ ,సభ్యులు డాక్టర్ హరీష్, నవీన్, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.