calender_icon.png 11 April, 2025 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనార్టీ అధికారిగా నదీమ్

04-04-2025 07:15:55 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిగా అబ్దుల్ నదీమ్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఉత్తర్వులు జారీ చేశారు. నదీమ్ జిల్లా ఆర్టికల్చర్ అధికారిగా ఇప్పటికే విధులు నిర్వహిస్తున్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురుకుల నియామకాలలో అవకతవకలు,అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో మైనారిటీ అధికారి మార్పు జరిగినట్లు విశ్వాసనీయ సమాచారం. గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి గతంలో మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారిగా ఇన్చార్జిగా కొనసాగారు.మైనార్టీ సంక్షేమ శాఖలో నిత్యం అవినీతి ఆరోపణలు వస్తుంటాయి.