22-04-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 21(విజయక్రాంతి) : జలమండలి పీఅండ్‌ఏ డైరెక్ట ర్‌గా మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం పీఅండ్‌ఏ సీజీఎం గా విధులు నిర్వహించిన ఆయన పీఅండ్‌ఏ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఈ నేపథ్యం లో సోమవారం జలమండలి ఎండీ అశోక్‌రెడ్డిని ఖాదర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ఎండీ అశోక్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుతం ఖాదర్ టీ జీఏ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఖాదర్‌ను టీజీఏ హైదరాబాద్ జి ల్లా అధ్యక్షుడు ఎంబి కృష్ణయాదవ్ తదితరు లు సన్మానించారు. కార్యక్రమంలో టీజీఏ స హాధ్యక్షులు ఆశన్న, ట్రెజరర్ ఎంవిరమణ, జాయింట్ సెక్రటరీ శ్రీరామ్, డా.రమేష్, డా. కోటాజీ, జె.రవికుమార్, డా.క్రోత విద్యాసాగర్, డా.సునీతాజోషి పాల్గొన్నారు.