calender_icon.png 21 March, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబ్దుల్ కలాం ట్రస్ట్ పేద విద్యార్థులకు అండగా ఉంటుంది

20-03-2025 09:11:20 PM

ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీలో అంతర్గాం తాసిల్దార్ తూమ్ రవీందర్ పటేల్...

అంతర్గాం (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మండల కేంద్రంలోని అంతర్గాం, పొట్యాల, ఎల్లంపల్లి కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రి ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం ట్రస్టు ఆర్గనైజర్ సెక్రెటరీ కోల ప్రణీత్ గౌడ్ మాట్లాడుతూ... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్గాంత తాసిల్దార్, అబ్దుల్ కలాం ట్రస్టు గౌరవ అధ్యక్షులు తూము రవీందర్ పటేల్ హాజరై వారి చేతుల మీదుగా స్కూల్ పిల్లలకు పరీక్ష ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేశామని ట్రస్ట్ ఆర్గనైజర్ సెక్రెటరీ కోలా ప్రణీత్ గౌడ్ తెలిపారు. అనంతరం ముఖ్యఅతిథిగా విచ్చేసిన తూము రవీందర్ పటేల్ మాట్లాడుతూ.. పిల్లలు పదో తరగతి పరీక్షలు బాగా రాసి రాబోయే కాలంలో మరెన్నో ఉన్నతమైన చదువులు చదివి ఒక అబ్దుల్ కలాం లాగా గొప్ప మేధావులు తయారు కావాలని తూమూ రవీందర్ పటేల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం ట్రస్ట్ వైస్ చైర్మన్ గరిమెళ్ళ సాయికిరణ్, ప్రధాన కార్యదర్శి ఎనగందుల శ్రీకాంత్, ఆంగోత్ నరేష్, ఆంగోత్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.