calender_icon.png 15 October, 2024 | 5:32 PM

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

15-10-2024 03:51:48 PM

కోదాడ (విజయక్రాంతి): పట్టణంలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో అబ్దుల్ కలాం జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కలాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ హాజరై కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో అన్నీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదని అది ఒక్కటి ఉంటే చాలు కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చని ఈ సందర్భంగా అబ్దుల్ కలాం మాటలను గుర్తు చేయడం జరిగింది. అబ్దుల్ కలాం జీవితాన్ని విద్యార్థినులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణభారతి ట్రస్ట్ సభ్యులు, విద్యార్థినులు పాల్గొన్నారు.