కొండపాక (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా అబ్దుల్ హమీద్ కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరిని మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో హైదరాబాద్ లోని ఎలక్షన్ సిఈఓ కార్యాలయంలో పనిచేసి బదిలీపై జిల్లాకు వచ్చారు. ఈ సందర్బంగా జిల్లాపై పూర్తిగా అవగాహన తెచ్చుకొని జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు సమర్థవంతంగా అందేలా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇప్పటివరకు ఇక్కడ అదనపు కలెక్టర్ గా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాకు బదిలీ పైన వెళ్ళారు.