- ఆక్రమణకు గురవుతున్న జలాశయాలు
- ఎఫ్‌టీఎల్, శిఖం భూముల్లో నిర్మాణాలు
- అక్రమార్కులపై చర్యలు తీసుకోని అధికారులు
అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 25: హైదరాబాద్ విశ్వనగరానికి అనుకుని అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధి ఉండటంతో ఇక్కడ భూ ములకు రెక్కలొచ్చాయి. దీంతో చెరువు లు, కుంటలు, వాగులు కబ్జా అవుతున్నా యి. ఎఫ్‌టీఎల్, శిఖం భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యా పారులు పాగా వేస్తున్నారు. అయినా కూడా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
బొమ్మలకుంట చెరువు ఎఫ్‌టీఎల్‌లో వెంచర్
పిగ్లీపూర్ గ్రామ పరిధిలోని బొమ్మలకుంట చెరువు ఎఫ్‌టీఎల్‌ను ఆనుకొని వందల ఎకరాల భూమిలో ప్రైవేట్ వ్యక్తులు వెంచర్ ఏర్పాటు చేస్తున్నారు. చెరువు ఎఫ్‌టీఎల్‌లో మట్టితో నింపుతూ పూడ్చేస్తున్నారు. ఈ చెరువు ఆయకట్టు కింద వ్యవసాయ భూములున్నాయి. పిగ్లీపూర్ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 46లో దాదాపు 22.11 ఎకరాల సీలింగ్ భూములున్నాయి. ఇందు లో చెరువు శిఖం భూమి కూడా ఉన్నది. ఆ భూములు కూడా కబ్జాకు గురవుతున్నాయి. బొమ్మలకుంట చెరువును ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పరిశీలించి కబ్జా నుంచి కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.
మజీద్‌పూర్ చిన్నచెరువు కబ్జా
మజీద్‌పూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని చిన్నచెరువు ఎఫ్‌టీఎల్ భూమిలో మట్టి పోసి వెంచర్ చేస్తున్నారు. చిన్నచెరువుకు 33.11 ఎకరాల శిఖం భూములున్నాయి. కానీ ఆ భూమి తన పట్టా పొలమంటూ అదే గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి బండరాళ్లు వేసి, మట్టితో పూడుస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చిన్న చెరువు ఎఫ్‌టీఎల్‌లో రాళ్లు, మట్టి తో పూడ్చడంతో వరద నీట్టికి అడ్డుపడి చెరువలోని నీళ్లు వెళ్లదని చెబుతున్నారు.
అదే ప్రాంతం లో ఉన్న తాటి వనం కూడా ధ్వం సం చేశారని ఆరోపిస్తున్నారు. చిన్న చెరువులో గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్థు లు చేపలు పెంచుతూ బతుకుతున్నా రు. చెరువు ఆయకట్టు కింద రైతుల సాగు భూములు కూడా ఉన్నాయి. అలాంటి జీవనాధారమైన చెరువు కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలానికో హైడ్రా ఉండాల్సిందే
జీహెచ్‌ఎంసీ పరిధిలో చెరువులు, కుంట లు, వాగులు, ప్రభుత్వ భూములను కాపాడానికి రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిం ది. దీంతో జీహెచ్‌ఎంసీలో పరిధిలో అనేక అక్రమ కట్టడాలు కూలుతున్నాయి. హైడ్రాలాంటి సంస్థ ప్రతి మండ లానికి ఒక టి ఏర్పాటు చేస్తే చెరువులు, కుంటలను క టబ్జా నుంచి రక్షించవచ్చునని అబ్దుల్లాపూర్‌మెట్ మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
చెరువులను కబ్జాచేస్తే కఠిన చర్యలు
అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలో చెరువుల కబ్జాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. మేము వెంటనే స్పందించి కబ్జాకు పాల్పడిన వారిపై కేసులు పెడుతున్నాం. చెరువులు, కుంటలు కబ్జాచేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మజీద్‌పూర్‌లో చిన్నచెరువు ఎఫ్‌టీఎల్‌లో లే అవుట్ ఏర్పాటు చేస్తున్న వారిపై కేసు నమోదు చేశాం.
రజా, ఏఈ ఇరిగేషన్ అబ్దుల్లాపూర్‌మెట్ మండలం
ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం
మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉన్న చెరువులు కబ్జాకు గురవుతున్నాయని మండల ప్రజలతో కలిసి గతంలో పూర్తి వివరాలతో సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టర్ శశాంకకు ఫిర్యాదు చేశాం. ఇరిగేషన్ శాఖ అధికారులకు కూడా ఫిర్యాదులు అందాయి. అయినా కూడా అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలేదు. ఏర్పుల నర్సింహా, సీపీఎం కార్యదర్శి, అబ్దుల్లాపూర్‌మెట్