మహబూబ్‌నగర్, ఆగస్టు 1 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ అమలుకు సుప్రీంకోర్టులో అనుకూలమైన తీర్పు వెలువడటం, సీఎం రేవంత్‌రెడ్డి కోర్టు తీర్పును అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించినందుకుగాను పలు సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. గురువారం మహబూబ్‌నగర్‌లో మాదిగ జేఏసీ నేతలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు బొర్రా సురేష్, యాదగిరి, సుమన్, అరుణ్ పాల్గొన్నారు.