calender_icon.png 23 March, 2025 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీ అరవింద్ ధర్మపురిని విమర్శించే స్థాయి ఏబి చిన్నకు లేదు

22-03-2025 07:09:22 PM

ఎంపిపై మాట్లాడితే ఆర్మూర్లో తిరగనివ్వమని బీజేపీ నాయకుల హెచ్చరిక.. 

ఆర్మూర్ (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు మందుల బాలు అధ్యక్షున పాత్రికేయల సమావేశంకు విచ్చేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ కంచేటి గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జీ వీ నరసింహారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్, ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు మాట్లాడుతూ... నిన్నటి రోజున కాంగ్రెస్ ఏ బి శ్రీనివాస్ చిన్న మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఏ బి శ్రీనివాస్ చిన్న ఒక రాజకీయ వ్యభిచారి సంవత్సరానికి ఒకసారి ఆర్మూర్ కి వచ్చి ప్రెస్ మీట్ లు పెట్టడం తప్ప ఏమీ తెలవదని విమర్శించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దగ్గర మందనాలు పొందడానికి మాత్రమే ప్రెస్ మీట్ లు పెట్టి మాట్లాడతాడని విమర్శించారు.

ఎంపీ ధర్మపురి అరవింద్ సుదర్శన్ రెడ్డి పై మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కటి నిజమని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పిన మాటలు మోసపూరితమని స్పష్టంగా అర్థం అవుతుంది. ప్రైవేట్ స్థలాన్ని గవర్నమెంట్ నవోదయ విద్యాలయానికి కేటాయించినప్పుడే అసలు రైతులపై ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో అర్థమైంది. సుదర్శన్ రెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు సుదర్శన్ రెడ్డి విజన్ లేని నాయకుడని ఆయన మంత్రిగా ఉన్నప్పటి నుండి ఇప్పటివరకు నిజామాబాద్ కు ఎలాంటి అభివృద్ధి చేయలేదని బోధన్ ప్రాంతం అభివృద్ధికి ఆ మెడ దూరంలో ఉందని విమర్శించారు. ఎంపీ అరవింద్ ఆకాశం ఆకాశంపై ఉమ్మేస్తే మీ మీదే పడతదని అన్నారు ఏ బి చిన్న హైదరాబాదులో నీ వ్యవహారం ఏంటో నువ్వేంటో ప్రతి పార్టీకి తెలుసునని విమర్శించారు.

ఎంపి అరవింద్ పేరు ఉచ్చరించే స్థాయి కూడా నీది కాదని ఖబర్దార్ ఏ బి చిన్న ఇంకోసారి ఎంపిపై మాట్లాడితే ఆర్మూర్లో తిరగనివ్వమని హెచ్చరించడం జరిగింది. మచ్చలేని నాయకుడు మా ఎంపీ అరవింద్, మాట ఇచ్చి మడమ తిప్పకుండా పసుపు బోర్డ్ తెచ్చిన నాయకుడు అలాంటి నాయకుడిపై మాట్లాడితే నాలుక చీరేస్తామంటూ హెచ్చరించడం జరిగింది. అలాగే స్వర్గీయులు ధరంపురి శీనివాస్ మరణాన్ని కూడా రాజకీయం చేస్తూ మాట్లాడుతున్నటువంటి ఏ బి చిన్న ఖబర్దార్. డి.శ్రీనివాస్ రెండుసార్లు పిసిసి అధ్యక్షుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చేసిన కృషి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు కాంగ్రెస్ పార్టీ శీనన్నకు రుణపడి ఉండాలి శీనన్నకు అధికార లాంఛనాలతో అంతక్రియలు చేశామని పదేపదే హేళన చేయడం రాజకీయం చేయడం ఆర్మూర్ ప్రజలు నిన్ను నీ పార్టీని తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

ఏ బి చిన్న నీ రాజకీయం చిట్టెలుక నీ ఆకారం ఏనుగుంత కానీ నీ వ్యవహారం మేక లాంటిది  ఖబర్దార్ ఏ బి చిన్న ఇదే చివరి హెచ్చరిక నీకు. దొర దొర బిడ్డను కూడా ఓడ కొట్టిన  ఏకైక నాయకుడు మా ఎంపీ అరవింద్,నీకు కానీ నీ నాయకుడు సుదర్శన్ రెడ్డి కానీ ఎంపీ అరవింద్  గురించి మాట్లాడే  స్థాయి మీకు లేదు అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పాన్ శీను, పెంటయ్య, విజయ్ ఆనంద్, ఆర్య రాజేశ్వర్, షికారి శీను,గుగులోత్ తిరుపతి నాయక్, ఉదయ్ గౌడ్, కలిగోటా ప్రశాంత్, సాయినాథ్, ప్రసన్న గౌడ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.